Home / Movie News / స్టార్ ఇమేజ్ సంపాదించు‌కున్న శ్రీదేవి కుమార్తె

స్టార్ ఇమేజ్ సంపాదించు‌కున్న శ్రీదేవి కుమార్తె

 

బాలీవుడ్‌లో దివంగత మహానటి శ్రీదేవి కుమార్తె ‘జాన్వీ‘ నటించిన మొదటి సినిమా “థడక్” చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ‘కరణ్‌ జోహార్‌‘ నిర్మాతగా, ‘శశాంక్‌ ఖైతాన్‌‘ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు ‘షాహిద్‌ కపూర్‌‘ సోదరుడు ‘ఇషాన్‌ ఖత్తర్‌‘ హీరోగా నటించారు.

మరాఠీలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ గా నిలిచిన “సైరాట్‌” సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. అయితే జాన్వీ సినిమా కెరియర్ ప్రారంభించక ముందునుంచే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది.

 

janvi vogue magazine

Image source

అంతర్జాతీయ మ్యాగజైన్‌ వోగ్‌కు జాన్వి ఇంటర్వ్యూ, ఫోటోషూట్‌

జాన్వి తన కుటుంబం గురించి, తన మొదటి చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “అమ్మ జ్ఞాపకాలు నేను ఎప్పటికి మర్చిపోలేను” అని తన తల్లి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. జాన్వి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ వోగ్‌ యొక్క ఇంటర్వ్యూ, ఫోటోషూట్‌ లో పాల్గొన్నారు.

ఈ ఫోటోను షేర్ చేయడాన్ని ఎంతో ఆనందముగా ఫీల్ అవుతున్నాను. ఇది మ్యాగజైన్ కోసం నా తొలి కవర్ ఫొటో. ‘వోగ్ ఇండియా’ నాకు ఇంతటి ప్రత్యేక అనుభూతిని కలిగించినందుకు థ్యాంక్స్’ అని కామెంట్ రాసింది.

ఈ ఫోటోను చూసిన ఆమె ఫ్యాన్స్ శ్రీదేవిలానే ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె తల్లితో కలిసి జాన్వి ఎన్నో ఫోటోలు దిగారు. కానీ హీరోయిన్ అయినా తర్వాత మొదటి సారిగా ఈ ఫోటోలు దిగడం. జాన్వీ ఫోటో స్టిల్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

About Kalyan

Be simple Think smart

Check Also

Kireeti Damaraju Eliminated

Big Boss 2: Kireeti Damaraju Eliminated

Big Boss 2 Kireeti Damaraju eliminated from the show according to the votes he got …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *