సూపర్ స్టార్ రజినీకాంత్ “కాలా ట్రైలర్”

వండర్‌బార్‌ ఫిలింస్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కబాలి డైరెక్టర్‌ ‘పా.రంజిత్‌’ దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ ‘రజనీకాంత్‌’ హీరోగా నటించిన “కాలా” సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. దీనికి నిర్మాతగా ‘ధనుష్’ వ్యహరిస్తున్నాడు. ముంబై నేపథ్యంలో మరోసారి డాన్‌గా కబాలి అలరించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో జూన్ 7న విడుదల చేస్తున్నారు.

"Kala" Movie trailer in telugu

ట్రైలర్‌లో తనదైన స్టైల్ ని ప్రదర్శించిన కబాలి. ప్రజల్ని రక్షించే దాదా కాలాగా రజనీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విలన్ గా బాలీవుడ్‌ నటుడు నానాపటేకర్‌ నటించారు. ‘కాలా’లో రజనీ భార్య పాత్రలో ఈశ్వరీ నటించారు. బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ప్రధాన పాత్ర పోషించారు.

రజినీ డైలాగులు అదుర్స్

ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే” అంటే నానాపటేకర్‌ చెప్పే డైలాగ్‌ అందరిని ఆకట్టుకుంది.

ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం… ఇది ఈ లోకానికి చాటుదాం.. కదలండి ఉద్యమిద్దాం…” అంటూ తలైవా చెప్పిన డైలాగ్ అందరిని ఆకర్షితులను చేసింది. “నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం” అంటూ రజనీ డైలాగులు అరిపించాయి.

ఐ లవ్‌ యూ’… అంటూ రొమాంటిక్‌ యాంగిల్‌ను చూపించిన రజినీ. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *